Sep 29,2023 22:17

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
           స్థానిక ఎఎంసి ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పంపిణీ కార్యక్ర మంలో ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎ స్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా ఆటోరిక్షా, ట్యాక్సి, మ్యాక్సిక్యాబ్‌, ఎండియు డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లకు రూ.1.22 కోట్ల నమూనా చెక్కును ఆయన పంపిణీ చేశారు.
       నరసాపురం టౌన్‌ : స్థానిక అల్లూరి కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రసాదరాజు మాట్లాడారు. అనంతరం వాహనదారులకు వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర నమూనా చెక్కును అందించారు. పాలకొల్లు : వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో పాలకొల్లులో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు నడపన గోవిందరాజులు, డిసిఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ, చందక సత్తిబాబు, మైకేల్‌ రాజు పాల్గొన్నారు.
        గణపవరం : ఉంగుటూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) శుక్రవారం చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ మాట్లాడారు.