వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు అందిస్తున్నకార్పొరేటర్ సారిపిల్లి గోవింద్
ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 25వ వార్డు పరిధి మధురానగర్ హైస్కూల్‌లో వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ ద్వారా బాలింతలకు, గర్భిణులకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతికుమారి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేముడుబాబు, వైద్యాధికారి సత్య కార్తీక్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కుమారి తదితరులు పాల్గొన్నారు.










