Aug 05,2023 00:20

కిట్లు ఇస్తున్న సర్పంచ్‌లు

ప్రజాశక్తి -కొత్తకోట:పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు ఇవ్వడంతో వ్యాధినిరోధక శక్తీ పెరగడంతో పాటు, మొదటి టీకాగా ఉపయోగ పడుతుందని దొండపూడి, మత్సవానిపాలెం సర్పంచ్‌లు ఎం.గణేష్‌, జి.రాజారావు అన్నారు. ఈ గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.ఆనంతరం గర్భిణీలకు, బాలిం తలకు సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తాతబాబు, సచివాల య కన్వీనర్‌ జి.నాగేశ్వరరావు, గృహసారధి రమేష్‌, వైసీపీ నాయకులు సోమిరెడ్డి శివ, బూరపు గోవింద్‌,అంగన్వాడీ కార్యకర్తలు దీప, రవణమ్మ, రత్నం, లక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు.