నల్లచెరువు : మండలకేంద్రంలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను బుధవారం ప్రారంభించారు. తొలుత వీరు బస్టాండ్ కూడలిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోటీలకు ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకొచ్చేకార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా నుండి కూడా అనేక జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ టోర్నమెంటులో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో వారి క్రీడాప్రదర్శనకు తాము సహకరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపంగి గోవర్ధన్, దశరథ నాయుడు, శ్రీధర్ రెడ్డి, దొడ్డప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు.










