Aug 09,2023 22:04

ప్రజాశక్తి - పెనుమంట్ర
         నేత్ర సమస్యలు ఉన్న ప్రతిఒక్కరూ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని పెనుమంట్ర సర్పంచి తాడిపర్తి ప్రియాంక అన్నారు. బుధవారం పెనుమంట్రలో సర్పంచి ఆధ్వర్యంలో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి ప్రియాంక మాట్లాడుతూ వృద్ధులకు కంటి పరీక్షలు, శస్త్రచికిత్స చేయించుకున్నవారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 60 ఏళ్ల లోపు వారికి 50 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు ఆనందరాజు కుమార్‌ బృందం, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.