
జిల్లా జాయింటు కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి
ప్రజాశక్తి - భీమవరం
నాలుగో ఏడాది వైఎస్‌ఆర్ కాపునేస్తం కార్యక్రమం ద్వారా జిల్లాలో 34,642 మంది మహిళా లబ్ధిదారులకు రూ.51.96 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని జిల్లా జాయింటు కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిడదవోలు బహిరంగ సభలో నాలుగో విడత వైఎస్‌ఆర్ కాపునేస్తంను కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు రాష్ట్రంలో 3,57,844 లక్షల మందికి రూ.536 కోట్ల 77 లక్షలు బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెసి ఎస్.రామ్ సుందర్‌రెడ్డి, ఎంబిసి ఛైర్మన్ పెండ్ర వీరన్న, సంబంధిత అధికారులు, కాపు మహిళలు తిలకించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన వారికి ఒక్కరికీ సంవత్సరానికి రూ.15 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. పథకాల లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత ఉండి ఏ కారణంచేతనైనా లబ్ధి జమ అవ్వకపోతే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేసి లబ్ధి అందజేయనున్నట్లు తెలిపారు. నాలుగో ఏడాది 2023-24కి గాను 34,642 మందికి రూ.51.96 కోట్లు నియోజక వర్గాలు వారీగా ఇలా జమచేశారు. ఆచంట నియోజక వర్గంలో 3,276 మందికి రూ.491.40 లక్షలు, భీమవరం నియోజకవర్గంలో 4,693 మందికి రూ.703.95 లక్షలు, నరసాపురం నియోజకవర్గంలో 6,062 మందికి రూ.909.30 లక్షలు, పాలకొల్లు నియోజకవర్గంలో 3,944 మందికి రూ.591.60 లక్షలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 5,264 మందికి రూ.789.60 లక్షలు, తణుకు నియోజకవర్గంలో 5,729 మందికి రూ.859.35 లక్షలు, ఉండి నియోజకవర్గంలో 4,092 మందికి రూ.613.80 లక్షలు, గణపవరం మండలంలో 1,582 మందికి రూ.237.30 లక్షలు మొత్తం జిల్లాలో 34,642 మందికి రూ.51.96 కోట్లు జమ అయ్యాయి. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒ కెసిహెచ్ అప్పారావు, బిసి కార్పొరేషన్ ఎఇఒ ప్రమీలారాణి, నాయీ బ్రాహ్మణ, కార్పొరేషన్ డైరెక్టర్ పట్నాల గౌరీ గణపతి పాల్గొన్నారు.