Sep 06,2023 21:16

వైఎస్‌ఆర్‌ జలకళకు విద్యుత్‌ షాక్‌

కడప ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ జలకళ పథకానికి విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కారు 2.5 ఎకరాల నుంచి ఐదు ఎకరాలు కలిగి అర్హులైన రైతులకు బోర్లు, మోటారు, కరెంట్‌ కనెక్షన్‌ సదుపాయాలను, ఐదు నుంచి 10 ఎకరాలు కలిగిన అర్హులైన రైతులకు బోరు ఖర్చును మా త్రమే భరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బోరు, మోటార్ల ఏర్పాటు ఖర్చుకు మించి కరెంటు కనెక్షన్‌ ఏర్పాటుకు మూడు నుంచి నాలుగు రెట్లు వ్యయం ఎక్కువ అవుతున్నట్లు గుర్తించింది. కరెంటు కనెక్షన్‌ నిబంధన కత్తిరింపులకు తెగబడింది. ఈ ఏడాది జూన్‌ నుంచి కరెంటు కనెక్షన్ల నిబంధనల నుంచి ఉపహరించుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌ జలకళ లబ్ధిదారులపై రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల భారం పడనుంది. కరెంటు ఖర్చుల వివరాల్లోకి వెళ్తే బోరు తవ్విన అనంతరం విద్యుత్‌ శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించి హార్స్‌ పవర్‌కు రూ.రెండు వేల చొప్పున 10 హార్స్‌పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి అదనపు ఖర్చులను కలిపితే రూ.25 వేలు, బోరుకు, కరెంటు లైన్‌కు సగటున మూడు నుంచి ఐదు కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడానికి పోల్‌కు రూ.30 వేల చొప్పున మూడు నుంచి ఐదు కరెంటు పోల్స్‌కు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు భరించాల్సి వస్తోంది. ఈలెక్కన జిల్లాలోని 7,093 దరఖాస్తుదారులకు సుమారు రూ.1000 కోట్ల చొప్పున రాష్ట్రంలోని 26 జిల్లాల రైతాంగంపై సుమారు రూ.26 వేల కోట్ల మేరకు భారం పడే అవకాశాలు ఉన్నట్లు ఓ అంచనా. ఇదిలాఉండగా 2019 నుంచి కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, బద్వేల్‌ నియోజకవర్గాల పరిధిలోని 8,893 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. 7,093 మంది పేర్లను విఆర్‌ఒలు సిపారసు చేశారు. 2,204 దరఖాస్తుదారుల అర్హతలపై సర్వేను పూర్తి చేశారు. 2,007 దరఖాస్తులకు మాత్రమే పాలనాపరమైన అనుమతి లభించింది. 728 బోర్లను తవ్వినట్లు తెలుస్తోంది. 659 బోర్లలో నీటి వనరుల లభ్యత కనిపించింది. 191 బోర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ కల్పించడం గమనార్హం. సదరు 191 బోర్లలో 169 మోటార్లకు అనుమతి లభించింది. 72 బోర్లకు మోటార్లను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 97 బోర్లకు మోటార్లను సరఫరా చేయాల్సి ఉంది. వైసిపి నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని 7,093 దరఖాస్తులకు 72 బోర్ల ఏర్పాటుకు పరిమితం కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈలెక్కన వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద 10 శాతానికి మించి బోర్లు తవ్వకపోవడం గమనార్హం. 72 బోర్లు మినహా అర్హత కలిగిన దరఖాస్తులకు, అనుమతుల మేరకు తవ్విన, బోర్లకు మోటార్లు, విద్యుత్‌ కనెక్షన్‌ సదుపాయాలను కల్పించే అవకాశాలకు కత్తెర పడడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ బోరు వద్ద రైతులు