
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
వైఎస్‌ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతోందని దెందులూరు ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్య చౌదరి తెలిపారు. పెదవేగి ఎండిఒ కార్యాలయం వద్ద వైఎస్‌ఆర్ జలకళ ద్వారా అర్హులైన రైతులకు ఎంఎల్‌ఎ మోటార్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.