చేయూత చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి
ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి
ప్రజాశక్తి-ఎటపాక
వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఎటపాక ఆశ్రమ పాఠశాల వద్ద వైయస్సార్ చేయూత వారోత్సవాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాల లో ఇచ్చిన హామీ మేరకు 45 ఏళ్లు పైబడి, 60 సంవత్సరాలు లోపు అర్హత గల మహిళలకు వైయస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతూరు, ఏటపాక, కూనవరం, విఆర్.పురం ఎంపీపీలు, జడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్లు, సొసైటీ ప్రెసిడెంట్లు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.










