Nov 16,2022 00:01

బీమా సొమ్మును అందజేస్తున్న వార్డు వైసిపి అధ్యక్షులు కెల్ల సత్యనారాయణ

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పాండురంగాపురం కాలనీకి చెందిన ఎస్‌కె.నాగూర్‌(47) సోమవారం పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందడంతో వైఎస్‌ఆర్‌బ బీమా తక్షణ సాయం కింద రూ.10 వేలు మృతుని భార్యకు వార్డు వైసిపి అధ్యక్షులు కెల్ల సత్యనారాయణ మంగళవారం అందజేశారు. మిగతా మొత్తం నామిని బ్యాంకు ఖాతాకు జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్‌ మమత, వైసిపి నాయకులు బేతా దుర్గారావు, వెంకటరెడ్డి, గోవిందు, బాబూరావు, పాండ్రంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.