కడప : వైసిపి జిల్లా కార్యాలయంలో శనివారం వైసిపి డాక్టర్స్ విభాగ అధ్యక్షులు శివనాయక్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వైసిపి జిల్లా అధ్యక్షులు నగర మేయర్ కె. సురేష్ బాబు, ఎపి ఎన్‌ఆర్‌టిఎస్ డైరెక్టర్ బి.హెచ్. ఇలియాస్, ఎపి సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ పులి సునీల్‌కుమార్ కేక్ కట్ చేసి డాక్టర్లకు తినిపించారు. వైద్య వత్తి ఎంతో గౌరవ ప్రదమైందని, వత్తి ధర్మాన్ని తప్పక పాటించి వైద్య సేవలు అందించాలని సందర్భంగా వారు సూచి ంచారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, కార్పొరేటర్ మల్లికార్జున, డాక్టర్స్ సొహైల్ అహ్మద్, వారణాసి ప్రతాప్ రెడ్డి, నగర యువజన అద్యక్షుడు ఆదిత్య, హెల్త్ అసోసియేషన్ నాయకులు వెంగల్ రెడ్డి, మేసా ప్రసాద్, ఎస్‌టి సెల్ అధ్యక్షులు నాయక్, ఎస్‌సి సెల్ అధ్యక్షులు వినోద్, వెంకట రమణ పాల్గొన్నారు. పోరుమామిళ్ల టౌన్ : సమాజంలో వైద్య వత్తి ఎంతో గౌరవ ప్రదమైందని రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి మార్కారెడ్డి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వైష్ణవి పాఠశాల నిర్వాహకులు, కరస్పాండెంట్ రామకష్ణ వైద్యులను ఘనంగా సన్మానించారు. పట్టణ ప్రయి వేట్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. కళ్యాణ చక్రవర్తి, రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి మార్కా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి,డాక్టర్ మదుల, డాక్టర్ సజన. చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ జయ రాములు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కడప అర్బన్ : ప్రాణదాతలైన వైద్యుల రుణం తీర్చుకోలేమని వన్ టౌన్ సిఐ నాగరాజు అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పాత కలెక్టరేట్‌లోని భారత జాతీయ కళా సాంస్కతిక వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) కార్యాలయంలో శనివారం ఆరుగురు వైద్యులను ఘనంగా సత్కరి ంచారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సత్కారం అనంతరం మాట్లాడుతూ వైద్యులు ప్రాణదాతలేనని, ఆ వత్తి నిరంతరం కత్తిమీద సాములాంటిదని పేర్కొన్నారు. ఆపదతో వచ్చిన బాధితులు చిరునవ్వుతో తిరిగి వెళ్లినపుడే వైద్యునికి నిజమైన సంతోషం లభిస్తుందని తెలిపారు. ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్ లయన్ కె. చిన్నపరెడ్డి అభ్యర్థన మేరకు ఆయన స్పందిస్తూ మొత్తం పాత కలెక్టరేట్ చుట్టూ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంస్థ పూర్వ కన్వీనర్ ఎస్. ఎలియాస్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ ప్రాచీన వైద్యానికి ఎంతో గొప్ప పేరు ఉందని చెప్పారు. కార్యక్రమంలోజిల్లా కన్వీనర్ లయన్ కె. చిన్న పరెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ పుత్తా బాలిరెడ్డి, డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి మాట్లాడుతూ సంస్థ కో కన్వీనర్ పి.వి.సుబ్బారెడ్డి, పోతుల వెంకట్రామిరెడ్డి, పద్మప్రియ చంద్రారెడ్డి, బాల యల్లారెడ్డి, ఆకతి కిశోర్, గౌరీశంకర్, కొండారెడ్డి, మనీష్, ముఖేష్ పాల్గొన్నారు. వేంపల్లె : వైద్యులు ప్రాణదాతలని పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ ఎస్‌ఎఫ్ బాషాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లాబకష్, చార్లెస్, పూల నజీర్, అమర్, సుబ్బరాయుడు, శివ, బద్రి, రాఘవయ్య, నరసింహరెడ్డి, రామకృష్ణ, సుబ్రమణ్యం, ఉత్తన్న, కృష్ణారెడ్డి, గౌసియా, ఖదీర్, ఓబులేసు, గంగాధర్, రసూల్, నాయకులు పాల్గొన్నారు. చాపాడు : మైదుకూరు పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో శనివారం డాక్టర్స్ డే సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు నాగార్జున పాల్గొన్నారు. ఆయనను పాఠశాల సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎ.వెంకటరామిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పులివెందుల టౌన్ : ప్రజలకు వైద్యులే ప్రత్యక్ష దేవుళ్లని మునిసిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ అన్నారు. స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో పులివెందుల ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సెల్వ రాజు, డాక్టర్ ఉషా పరిమళ రాణి, డాక్టర్ నవీన్, కంటి వైద్యులు డాక్టర్ హిమబిందు, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీప్రియ, వైద్యులు హిమబిందు, డాక్టర్ సుకన్య, రక్తనిధి మెడికల్ అధికారిని డాక్టర్ శుభశ్రీ, డాక్టర్ తేజ, డాక్టర్ ప్రకృతి, డాక్టర్ జగదీశ్‌ను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్, కౌన్సిలర్ కిశోర్, సేవా సమితి అధ్యక్షులు రాజు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు ప్రశాంత్, రాజా, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయనిర్మల, సేవాసమితి నేత్రనిధి టెక్నీషియన్ హరీష్, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.










