ప్రజాశక్తి-నక్కపల్లి:ఆసుపత్రిలో వైద్యులు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిసిహెచ్ శ్రావణ్ కుమార్ సూచించారు. నక్కపల్లి సిహెచ్‌సిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు బయటి మందులు, టెస్టులు రాయకూడదని వైద్యులకు సూచించారు. కాల వ్యవధి ముగిసే మందులను ముందుగానే గుర్తించాలని, ఇవి వృధా కాకుండా చూడాలన్నారు. రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు. అనంతరం 50 పడకల ఆసుపత్రికి సంబంధించి చేపడుతున్న భవన నిర్మాణం పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆసుపత్రి సూపర్డెంట్ జనార్ధన్ పాల్గొన్నారు.










