Nov 02,2023 20:47

డిఎంహెచ్‌ఒ జగన్నాధరావును సన్మానిస్తున్న ప్రసన్నకుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ :  టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని విశేష సేవలందించి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను, వారి సహచర బృందాన్ని కొనియాడుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్‌ జగన్నాధరావు, డిసిహెచ్‌ఎస్‌, డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌ వాగ్దేవిని, ప్రాజెక్ట్‌ ఆర్గనైజర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ జగనన్న ఆరోగ్య సురక్ష జ్ఞాపికలతో వారిని ఘనంగా సత్కరిస్తూ పేదలకు విశేష వైద్య సేవలందించి సహకరించారన్నారు. అదే విధంగా పేదల ఆరోగ్యం పట్ల భవిష్యత్తులో కూడా స్వచ్ఛందంగా మరింకెన్నో సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ను డాక్టర్లంతా కలిసి ప్రభుత్వం తరుపున చేస్తున్న కృషిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో మంచి స్థానంలో మరెన్నో విశేష సేవలందించాలని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.