Jul 02,2023 01:50
సంచికను ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ వసంతం వీరరాఘవయ్య తదితరులు

ప్రజాశక్తి-రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె విఎన్‌ఎం పిల్లల వైద్యశాలలో ప్రజాశక్తి రూపొందించిన జాతీయ వైద్యుల దినోత్సవ ప్రత్యేక సంచికను డాక్టర్‌ వసంతం వీరరాఘ వయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాశక్తి పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందని అన్నారు. అలాంటి కోవలో ప్రజాశక్తి కథనాలను ఇష్టపడే వారిలో తాను కూడా ఉన్నానని తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్న పత్రికల్లో ప్రజాశక్తి ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా వైద్యుల గొప్పతనాన్ని సమాజానికి తెలియజేసేలా జాతీయ వైద్యుల దినోత్సవ ప్రత్యేక సంచికను తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ, అదేవిధంగా సమస్యలను ఎండగట్టడంలోనూ విన్నూత పద్ధతులలో ఆలోచించటం ప్రజాశక్తికే చెల్లుతుందన్నారు. పట్టణంలో డాక్టర్స్‌ డే ప్రత్యేక సంచికను ఆవిష్కరించడం పట్టణ ప్రత్యేకతను చాటిందని అన్నారు. అలాగే కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి కృషి చేస్తున్న పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్స్‌ డే ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో ప్రజాశక్తి సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.