ప్రజాశక్తి - పంగులూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ సహకారంతో గుండె వైద్య నిపుణుల బృందం సోమవారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి 150మంది హాజరయ్యారు. వీరికి గుండె పరీక్షలు నిర్వహించారు. వారిలో 15మందిని అదనపు పరీక్షల నిమిత్తం విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్ కు రిఫర్ చేసినట్లు రోటరీ క్లబ్ క్యాంపు కన్వీనర్ చిలుకూరీ వీరరాఘవయ్య తెలిపారు. ఖరీదైన గుండె స్కానింగ్ పరీక్షలు, ఈసీజీ, 2డి, ఈసి హెచ్ఓ పరీక్షలు ఉచితంగా చేశారు. కార్యక్రమంలో డాక్టర్స్ జ్వాలా సాయి, పి ఆర్ఓ సతీష్, రోటరీ సభ్యులు జగదీశ్వరరావు, గుర్రం ఆంజనేయులు, పోతిన ప్రసాద్ పాల్గొన్నారు.










