వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు
ప్రజాశక్తి-జిమాడుగుల: మండలంలో కోరాపల్లి పంచాయతీ అరగడాపల్లి గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు వైద్యులు శశికాంత్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పలువురికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆరుగురు జ్వర పీడితులకు సాదారణ జ్వరంగా నిర్ధారణ అయ్యింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రకాష్, శోభన్ బాబు, కృష్ణ కుమారి, మంగమ్మ పాల్గొన్నారు.










