Sep 22,2023 00:03

వైద్యశిబిరాలను సందర్శించిన స్విమ్స్‌ డైరెక్టర్‌

వైద్యశిబిరాలను సందర్శించిన స్విమ్స్‌ డైరెక్టర్‌
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్విమ్స్‌ ఆధ్వర్యంలో స్వామివారి భక్తుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేసి, అవసరమైన వారికి వైద్యసేవలను అందిస్తున్నట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి.కుమార్‌ తెలిపారు. అలిపిరి, శ్రీవారిమెట్టు వైద్యచికిత్స కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. బహ్మోత్సవాల సందర్భంగా స్విమ్స్‌ హాస్పిటల్‌ నుండి వైద్యులను, పారామెడికల్‌, నర్సింగ్‌ సిబ్బందిని అలిపిరి, శ్రీవారిమెట్టు వద్దనున్న ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్స్‌కు డెప్యుటేషన్‌ మీద ఈనెల 18నుండి 26వ తేదీ వరకు రెండు షిఫ్టులలో ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు 9 రోజుల పాటు భక్తుల కోసం వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు.