ప్రజాశక్తి - కోసిగి రూరల్
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో వైద్య రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకు రావడంతో ప్రజలకు మరింతగా చేరువలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండల వైద్యాధికారి డాక్టర్ మనోజ్ కుమార్ అధ్యక్షతన కోసిగి ప్రభుత్వాస్పత్రికి నూతనంగా మంజూరైన 108 అంబులెన్స్‌ను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా మురళీ మోహన్ రెడ్డి హాజరయి మాట్లాడారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ వైద్యసేవలు, ఆస్పత్రికి తరలించే పాత అంబులెన్స్ స్థానంలో మెరుగైన వసతులతో నూతన 108 అంబులెన్స్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎల్లమ్మగుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు. ఎంపిపి ఈరన్న, బెట్టనగౌడ్, కాంట్రాక్ట్ నాగరాజు, నాడిగేని నాగరాజు, మాణిక్యరాజు, జగదీష్ స్వామి, ముకుంద కృష్ణమూర్తి, పందికోన మారెప్ప పాల్గొన్నారు.
108 నూతన అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్ రెడ్డి










