నర్సు పద్మావతిని సన్మానిస్తున్న డాక్టర్ బాబూరావు
ప్రజాశక్తి-చీరాల: వైద్య రంగంలో నర్సులు ఎంతో కీలకమని, వారి సేవలు అభినందనీయమని రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబూరావు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ నర్సు ల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైకుంఠపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నర్సులుగా విధులు నిర్వహిస్తున్న విజయ, ధన, సత్య వేదం, పద్మావతి, రమాదేవి నర్సులను ఘనంగా సత్కరించారు. అత్యవసర వైద్య సేవలను అందించడంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. మదర్ థెరిస్సా ఆదర్శ భావాలతో నర్సులందరూ ప్రజల ఆరోగ్యం పట్ల విధులు నిర్వహిస్తూ అందరి మన్నలను పొందాలని కోరా రు. కార్యక్రమంలో డాక్టర్ శంకరరెడ్డి, డాక్టర్ జ్యోతిరావు, హాస్పిటల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పోలుదాసు రామకృష్ణ, రోటరీ ప్రతినిధులు, నర్సులు పాల్గొన్నారు.










