Jul 02,2023 00:53

సత్తెనపల్లిలో ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న డిఆర్‌ఒ, డిఎంహెచ్‌ఒ, తదితరులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి టౌన్‌, సత్తెనపల్లి : అన్ని వృత్తులలోనూ వైద్య వత్తి ఎంతో కీలకమైనదని, బాధ్యతతో కూడుకుందని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం అన్నారు. డాక్టర్స్‌ డేను పురస్కరించుకొని పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాశక్తి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన డాక్టర్స్‌ డే ప్రారంభ సభకు ప్రజాశక్తి మేనేజర్‌ జి.శివరామకష్ణయ్య అధ్యక్షత వహించారు. డిఆర్వో మాట్లాడుతూ నేటి అధునాతన సమాజంలో వస్తున్న జబ్బులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని, వైద్యుల పాత్ర ఇప్పుడెంతో కీలకమని అన్నారు. ప్రజాశక్తి సేవ దృక్పథంతో శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జి.శోభారాణి మాట్లాడుతూ బాధపడుతున్న రోగికి నమ్మకాన్ని కల్గించాల్సిన భాధ్యత వైద్యులపై వుంది అన్నారు. వైద్య రంగంలో డాక్టర్స్‌కు ఛాలెంజ్‌ గా మారుతున్న జబ్బులను వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పట్టి రోగులకు వైద్య సేవలు అందించటం అభినందనీయం అన్నారు. కరోనా సమయంలో వైద్యుల సేవలు ఏనలేనివని చెప్పారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శోభారాణి, డిఆర్‌ఒ వినాయకం, డాక్టర్లు గోపినాయక్‌, షకీలా, శ్రీధర్‌, రాజమోహన్‌రెడ్డి, రామకృష్ణ, వై.అనిత , వై.నరసింహారావు, హైదర్‌లను సత్కరించారు. తొలుత డాక్టర్‌ బిసి రారు, ప్రజాశక్తి సాహితీ సంస్థ మాజీ చైర్మన్‌ కొరటాల సత్యనారాయణల చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్స్‌ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
ఇదిలా ఉండగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ముందుగా ఈ శిబిరాన్ని విశ్రాంత ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం.గోపినాయక్‌ ప్రారంభించారు. షుగర్‌, బీపీ పరీక్షలు, ఎముకలు, కీళ్లు, నరాలు, దంత వైద్యం, జనరల్‌ వైద్యం, స్త్రీల సంబంధిత వ్యాధులు, గుండె పరీక్షలు, చిన్నపిల్లల వైద్యం, ప్రసూతి తదితర విభాగాలుగా ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆయా విభాగాలను డిఎంహెచ్‌ఒ, డిర్‌ఒ పరిశీలించారు. కార్యక్రమంలో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ పొట్టి సూర్యప్రకాశరావు, సభ్యులు గద్దె చలమయ్య, పిన్నమనేని పాములయ్య, ప్రజాశక్తి జిల్లా ఇన్‌ఛార్జి చుక్క శంకర్రావు, పల్నాడు డివిజన్‌ ఇన్‌ఛార్జి, ఎన్‌కృష్ణ, నరసరావుపేట డివిజన్‌ ఇన్‌ఛార్జి ప్రేమ్‌కుమార్‌, విలేకరులు విలేకరులు అడపాల నాగేశ్వరరావు, మునగా వెంకటేశ్వరరావు, అంకాళ్ల నాగరాజు, దర్శి శేషారావు, బుజ్జిబాబు, అనిల్‌, సీతారామయ్య, ప్రజా సంఘాల నాయకులు అనుముల వీరబ్రహ్మం, పెండ్యాల మహేష్‌, జడ రాజకుమార్‌, మామిడి జగన్నాధరావు, గద్దె ఉమాశ్రీ, ధరణికోట విమల, గుంటూరు మల్లేశ్వరి పాల్గొన్నారు.