Aug 15,2023 20:42

శ్రీనివాసురావును సన్మానిస్తున్న డాక్టర్‌ అనురాధ,సిబ్బంది

ప్రజాశక్తి - లింగసముద్రం :విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్‌ఒ శ్రీనివాసరావును సన్మానించారు. మంగళవారం వైద్యశాలలో వైధ్యాధికారిణి డాక్టర్‌ అనురాధ, వైద్యశాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య సేవా రంగంలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించనందుకు గానూ ఆయన సేవలను గుర్తించి ప్రశంసాపత్రంతో జిల్లా అధికారులు సత్కరించారు.