Sep 21,2022 23:14

ఆరిలోవలో టిడిపి నిరసన

టిడిపి ఆధ్వర్యాన పలుచోట్ల నిరసన
ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం
గాజువాక
: జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్‌టిఆర్‌ పేరును తొలగించడం దారుణమని టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 1986 ఎన్‌టిఆర్‌ ఈ వర్సిటీని స్థాపించారని, ఎన్‌టిఆర్‌ మరణానంతరం అతని పేరు పెట్టారన్నారు. మూడున్నరేళ్ల వైసిప పాలనలో ఈ వర్సిటీకి పైసాకూడా విదిలించకపోగా, స్నాతకోత్సవాలకు నిధులివ్వని సిఎం జగన్‌, చివరకు ఈ యూనివర్సిటీ నిధులు రూ.450కోట్లను కాజేశారన్నారు. ఎటువంటి సంబంధం లేని వైఎస్‌ఆర్‌ పేరును వైద్యవిశ్వవిద్యాలయానికి పెట్టడం దారుణమన్నారు. సమావేశంలో నమ్మి సింహాద్రి, నరేంద్ర, బంగారు తులసి, పాల్గొన్నారు.
ఆనందపురం: విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీకి మార్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ రాష్ట్ర తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య అధికార ప్రతినిధి లంక సురేష్‌ అన్నారు. అసెంబ్లీలో బలముందన్న అధికారమదంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. తెలుగునాడు విద్యార్థి నేతలు కోరాడ వైకుంఠరావు,కంటుబోతు సుమంత్‌ నాయుడు, బసన అప్పలరాజు ఉన్నారు. తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : వైద్యవిశ్వవిద్యాలయానికి ఎన్‌టిఆర్‌ పేరును తొలగించి, వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ
జివిఎంసి 9, 10, 11, 12, 13 వార్డుల టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఆరిలోవ, దుర్గాలమ్మ గుడి దరి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టిడిపి నేతలు బుడుమూరు గోవిందు, మద్దిల రాజశేఖర్‌, గాడు అప్పలనాయుడు, ఒమ్మి అప్పలరాజు, ఒమ్మి పోలారావు, గాడి సత్యం, మూది అప్పారావు, ముగడ రాజారావు, నమ్మి గణేష్‌, పొత్రకండ ధర్మారావు, యల్లమిల్లి సురేష్‌, బాలస్వామి, బాలరాజు, మజ్జి రమణి పాల్గొన్నారు.
కంచరపాలెం : వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్‌టిఆర్‌ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ 56వ వార్డు కార్పొరేటర్‌ శరగడం రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఆర్‌పిపేట, రైల్వేగేటు దరి ఎన్‌టిఆర్‌ విగ్రహానికి టిడిపి నేతలు పాలభిషేకం చేశారు. నిరసన చేపట్టారు. 52వ వార్డు టిడిపిఅధ్యక్షులు ఎన్‌ వాసుదేవరావు, నాయకులు పల్లా ధర్మారావు, మల్లా రాంప్రసాద్‌, కోరుమిల్లి సత్యనారాయణ, నక్క శంకరరావు, దొడ్డి సోమేష్‌ పాల్గొన్నారు
మాధవధార : హెల్త్‌ వర్సిటీకి ఎన్‌టిఆర్‌ పేరును తొలగించడం సిగ్గు చేటని 50వ వార్డు టిడిపి అధ్యక్షుడు సనపల వరప్రసాద్‌ అన్నారు. జగన్‌ ప్రభుత్వ నిరంకుశ ధోరణి, దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమన్నారు. ఎన్‌టిఆర్‌ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు.
తగరపువలస : వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్‌టిఆర్‌ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో స్థానిక చిన్న బజారు జంక్షన్‌లో నిరసన చేపట్టారు. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.1,2,3,4 వార్డుల టిడిపి అధ్యక్షులు టి.సూరిబాబు, బడిగింటి నీలకంఠం, గంటా నూకరాజు, పాసి నరసింగరావు, మాజీ జెడ్‌పిటిసి సరగడ అప్పారావు, నేతలు చిలకా నరసింగరావు, కనకల అప్పల నాయుడు, సంకురుభుక్త జోగారావు, జి పోలిరాజు, నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పతివాడ రాంబాబు, తెలుగు మహిళ నియోజక వర్గ అధ్యక్షులు బోయి రమాదేవి, కె లీలావతి, అరుణ పాల్గొన్నారు.
రెండో వార్డు పరిధి తగరపువలసలో వార్డు కార్పొరేటర్‌ గాడు చిన్నికుమారి లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టిడిపి నేతలు గాడు అప్పలనాయుడు, మాజీ కౌన్సిలర్లు పిట్టా వెంకటరావు, చేట్ల రమణ, సాయి జయశంకర్‌, జోగ సన్యాసిరావు, యు దుర్గారావు పాల్గొన్నారు.
పెందుర్తి: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గపు చర్య అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు ఆక్షేపించారు.దీన్ని నిరసిస్తూ పెందుర్తి జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. 96వ వార్డు టిడిపి అధ్యక్షులు వేగిపరమేశ్వరరావు, పెందుర్తి మండల టిడిపి అధ్యక్షులు కరక దేముడు పాల్గొన్నారు.