Aug 07,2023 21:59

.కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు

కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్‌ కళాశాలల్లో సీట్ల అమ్మకం ఆపి పాత పద్ధతిలోనే ఎ కేటగిరీ ద్వారానే సీట్ల భర్తీ జరగాలని సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్‌ డిమాండ్‌ చేశారు. సోమ వారం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ అధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కళాశాల సీట్లు అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చాలనుకోవడం సరైన చర్య కాదని విమ ర్శించారు. మెడికల్‌ కళాశాలల్లో సీట్ల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం రూ .40 కోట్లు మాత్రమే అన్నారు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాబోదన్నారు. ప్రయివేట్‌ కళాశాలలో మాదిరిగానే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లోనూ ప్రతిభకు కాకుండా డబ్బులున్న వారికే సీటు కట్టబెట్టే ప్రయత్నం చేస్తు న్నారని తీవ్రంగా విమర్శించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జులై 19న జీవో నంబర్‌ 107 తీసుకువచ్చి విద్యార్థుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కళాశాలల్లో 750 సీట్లకు అనుమతి వచ్చిందని అన్నారు. వీటిలో 113 సీట్లు ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ చేస్తారని, మిగిలిన 637 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏ కేటగి రిలో రిజర్వేషన్‌ అనుసరించి ప్రతిభ ఉన్న వారితో భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలా కాకుండా 319 సీట్లను అమ్మకానికి పెట్టి ప్రతిభ గల విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తక్షణమే ఈ భారాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు గోపాల కష్ణయ్య, ఓబు లేసు, ఫారుక్‌ , అన్వర్‌, శివకుమార్‌, షాకీర్‌, ఎమ్మార్‌ నాయక్‌, సునీల్‌, రెబ్బ నరసింహ, కామేశ్వరమ్మ, సరిత, రామకష్ణారెడ్డి, మాధవ రెడ్డి, విజరు, శివరాం, రవి, పాలయ్య, శ్రీనివాసులు, సురేష్‌ పాల్గొన్నారు