Sep 13,2023 22:08

రీసెర్చి కన్సల్టెన్సీ ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌

వైద్య విద్యార్థులకు రీసెర్చ్‌ కన్సల్టెన్సీ సెల్‌ ప్రారంభం
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
ఎస్వీ వైద్య కళాశాలలో సామాజిక వైద్య విభాగంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌. చంద్రశేఖరన్‌, రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ జి రవి ప్రభు రీసెర్చ్‌ కన్సల్టెన్సీ సెల్‌ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా ఎస్‌ వి వైద్య కళాశాలలో రీసెర్చ్‌ కన్సల్టింగ్‌ సెల్‌ ప్రారంభించామని, యుజి, పీజీ వైద్య విద్యార్థులకు, వైద్య అధ్యాపకులకు, అలైడ్‌ సైన్స్‌ విద్యార్థులకు, నర్సింగ్‌, ఫార్మా, సోషల్‌ సైన్స్‌, విద్య వైద్య రంగములోనే కాకా వివిధ రంగంలో పరిశోధనల నిమిత్తం చదువుతున్న, పనిచేయుచున్న విద్యార్థినీ విద్యార్థులకు, ఈ రీసెర్చ్‌ కన్సల్టింగ్‌ సెల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ జి.రవి ప్రభు మాట్లాడుతూ రీసెర్చ్‌ కన్సల్టెన్సీ వలన మెరుగైన డేటాను పొందుపరిచేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పై పరిశోధనలు జరిపి, అర్బన్‌ స్లమ్‌ ఏరియా లలో ప్రజల ఆరోగ్యం పై డేటా కలెక్ట్‌ చేసి విలువైన సమాచారమును తయారు చేసుకొనచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ (అడ్మిన్‌ ) డాక్టర్‌ వెంకటేశ్వర్లు, పారామెడికల్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవి లత, డాక్టర్‌ సునీత పాల్గొన్నారు.
రీసెర్చి కన్సల్టెన్సీ ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌