Oct 01,2023 21:37

ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌

వైద్య శిబిరంలో కాకర్ల పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత నియోజకవర్గ టిడిపి నాయకులు కాకర్ల సురేష్‌ నూతన వధూకు పెళ్లి కానుక అందజేసి ఎన్‌టిఆర్‌ సంజీవని ఆరోగ్య రథం అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆదివారం వింజమూరు మండలంలోని సుజాతనగర్‌ కాలనీలో షేక్‌ సుల్తాన్‌, హసీనా కుమార్తె వివాహముకు కాకర్ల ట్రస్ట్‌ అధినేత కాకర్ల సురేష్‌ నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లికానుకగా రూ.10వేలను అందజేశారు.
అనంతరం దుత్తలూరు మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామంలో చేజర్ల పెంచలరెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సంజీవని ఆరోగ్య రథం ద్వారా అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అలాగే వైద్యులు అందిస్తున్న సేవలను గ్రామస్తుల నుండి తెలుసుకొని గ్రామస్తులతో సమావేశమై గ్రామంలోని సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో షేక్‌.ఖాజావలీ, మల్లినేని పవన్‌, సర్పంచ్‌ మీసాల సుబ్బరాయుడు, సురే వెంకటేశ్వర్లు, చేజర్ల పెంచలరెడ్డి,సురే రమణారెడ్డి, దుగ్గినబోయిన కొండయ్య, కరణం రమేష్‌, పరిమి ప్రతాప్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.