Mar 24,2023 23:51
రోగులను పరీక్షిస్తున్న డాక్టర్‌ సాంబయ్య

ప్రజాశక్తి-పంగులూరు: సురక్ష హాస్పిటల్స్‌ సిబ్బంది పంగులూరులోని పెద్ద బడి దగ్గర శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 120 మంది రోగులు హాజరై పరీక్ష చేయించుకున్నారు. ఈ రోగులను సురక్ష హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ అన్నవరపు సాంబయ్య పరీక్షించి, వైద్య పరీక్షలు నిర్వహించి, వారందరికీ ఒక వారం రోజులకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. వచ్చిన ప్రతి పేషెంట్‌కు షుగరు, బీపీ పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో సాధారణ వ్యాధులకు, గ్యాస్‌ ట్రబుల్‌, బిపి, తలనొప్పి, ఎముకలు, కీళ్ల వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సురక్ష హాస్పిటల్‌ ఫార్మసిస్ట్‌ వి శ్రీనివాసరావు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ కే అరుణ, పిఆర్‌ఓ కొండారెడ్డి పాల్గొన్నారు.