Jul 02,2023 20:35

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి - ఆదోని
సంతానం లేని వారికి ఆవోపా, ప్రైమ్‌ ప్లస్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం వాసవీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత ఐవిఎఫ్‌ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్‌ గుప్త, మిరియాల శ్రీధర్‌ తెలిపారు. కర్నూలు ప్రైమ్‌ ప్లస్‌ ఆస్పత్రి సహకారంతో, మాజీ అధ్యక్షులు, దాత కాకుబాళ్‌ నాగేష్‌ సౌజన్యంతో చేపట్టిన ఐవిఎఫ్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు భారీ స్పందన లభించిందన్నారు. దాదాపు 353 మంది సంతానం లేని దంపతులు ఈ క్యాంపునకు విచ్చేసి వైద్యుల సలహాలు తీసుకున్నారని తెలిపారు. అవసరమున్న వారికి ఉచితంగా ఐయుఐ, సెమిన్‌ ఎనాలిసిస్‌ పరీక్షల కోసం కర్నూలుకు పంపనున్నట్లు చెప్పారు. రాయలసీమలో మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ క్యాంపునకు భారీ స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. హాలును ఉచితంగా కేటాయించిన వాసవీ కల్యాణ మందిరం కమిటీకి, వాలంటీర్లుగా వచ్చిన సభ్యులు, పెద్దలు, మహిళలకు మహిళా విభాగ్‌ అధ్యక్ష, కార్యదర్శులు సంగీత, మమతశ్రీ ధన్యవాదాలు తెలిపారు. రాచోటి సుధాకర్‌, విట్టా రమేష్‌, నగేష్‌, ప్రైమ్‌ ప్లస్‌ ఎమ్‌డి అజరుకుమార్‌, డాక్టర్‌ గౌతమ్‌ చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతాప్‌, ఈరన్న శెట్టి, రంగనాయకులు, రాంప్రసాద్‌, రఘు, రాజగోపాల్‌, హిమబిందు, గీత, కవిత, లావణ్య, సౌజన్య, తులసి, యశోద, విద్య పాల్గొన్నారు.