Oct 18,2023 20:32

డెంకాడ: వైద్య సిబ్బందిని సత్కరిస్తున్న ఎంపిపి వాసుదేవరావు

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని చింతలవలస సచివాలయం-2లో మోపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూప్‌ రాణి సాలువతో పాటు సన్మానించి గిఫ్ట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ వైద్య సిబ్బంది తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 45 రోజులపాటు ప్రజలకు సేవలు అందించారని వారిని సన్మానించడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, ఐసిడిఎస్‌ సిబ్బంది పలువురు నాయకులు పాల్గొన్నారు.
వేపాడ: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో ఎంపిపి దొగ్గ సత్యవంతుడు పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, సర్పంచ్‌ రుద్ర అంజలి, ఎంపిటిసి లక్ష్మి, పార్టీ అధ్యక్షుడు జగ్గు బాబు, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్‌ సన్యాసినాయుడు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నిరుజోగి వెంకటరావు, జెఎసి కన్వీనర్లు, తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌, ఎంపిడిఒ పట్నాయక్‌, ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ కామేశ్వరి, పిహెచ్‌సి వైద్యాధికారులు, పాల్గొన్నారు.
బొండపల్లి: జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరికి రక్షణ కవచంలా ఉంటుందని ఎంపిపి చల్ల చలం నాయుడు అన్నారు. గురువారం మండలంలోని కొండకిండాం గ్రామంలో తహశీల్దారు డిఎంజిఎన్‌ ప్రసాదరావు ఆద్వర్యంలో సర్పంచ్‌ పెదమజ్జి ఆదిలక్ష్మి అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరి ఆరోగ్యం కోసం ప్రభుత్వం మంచి ఆలోచన చేసి గ్రామాలకు వైద్య బృందాలను పంపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షలు బొద్దల చిన్నం నాయుడు, బుంగ దేవుడు, పంచాయతీ కార్యదర్శులు కొండ్రోతు నిహారిక, తుంపల్లి అచ్యుత రావు, విఆర్‌ఒ హరి, చొక్కాకు నారాయణరావు, పెదమజ్జి గోపి, పెదమజ్జి నాయుడు బాబు, బోపారపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బొబ్బిలి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా బుధవారం 19వ వార్డులో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మధుమేహం, బిపి వైద్య పరీక్షలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.