నినాదాలు చేస్తున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:వేధింపులకు పాల్పడుతున్న మండలంలోని పెనుగొల్లు ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి బిఎల్ రామ్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు ధర్నా చేపట్టారు. పెనుగొల్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశాల పట్ల వైద్యాధికారి దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పని చేస్తున్న వారికి మెమోలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ నలుగురిలో అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డరోడ్డులో తన సొంతం క్లినిక్‌కు పేషెంట్లను తీసుకు రమ్మంటున్నారని తెలిపారు. ఆయనను ఇక్కడి నుండి బదిలీ చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.










