Oct 18,2023 18:56

ఆరోగ్య సురక్ష శిబిరాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేసేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని కమ్మ వీధి ప్రాంతంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత సరళతరమైన ఆరోగ్య సేవలు అందుతున్నాయన్నారు. స్థానిక కార్పొరేటర్‌ గుజ్జల నారాయణరావు, సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ రావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు,
నగరంలోని 3వ డివిజన్‌ పూల్‌బాగ్‌ వాడవీధి పార్క్‌ నుండి ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలోకోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన బుక్లెట్లను స్థానికులకు అందజేస్తూ అర్హత ఉండి పథకాలు పొందలేని వారి వివరాలను తెలియజేయాలని కోరారు. చిన్నచిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అక్కడున్న అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వి వి రాజేష్‌, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, 2వ డివిజన్‌ కార్పొరేటర్‌ బండారు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నగరంలోని 39, 42 డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బొబ్బాదిపేట, గౌతమి నగర్లలో 9 లక్షల రూపాయలతో అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, 42వ డివిజన్‌ దండుమారమ్మ ఆలయం ప్రాంతంలో రూ.23 లక్షలతో నాలుగు చోట్ల నిర్మించిన రహదారులను ప్రారంభించారు. జోనల్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ వి ఎస్‌ ప్రసాద్‌, మేయర్‌ విజయలక్ష్మి, వైసిపి నాయకులు పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.