ప్రజాశక్తి - చింతలపూడి
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కేకవరం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ ఆర్.కృష్ణకిషోర్ తెలిపారు. శనివారం ప్రగఢవరం వైఎస్‌ఆర్ క్లీనిక్‌లో ఆయుష్మాన్ భవ కార్యక్రమం కింద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరునికి ఉచిత వైద్య సేవలు, వైద్య పరీక్షలు, టెలీ మెడిసిన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి అబ్‌రార్ హుస్సేన్‌తో పాటు భరత్ కుమార్, నర్మదా రాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










