మాట్లాడుతున్న చైర్మన్ గొల్లపల్లి విజరు
వైద్య సేవే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష
ప్రజాశక్తి-ఇందుకూరుపేట::ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం అని రాష్ట్ర పశుగణాభివద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజరు కుమార్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని డేవిస్‌పేట ఆరోగ్య కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికీ వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి ఉచితంగా వైద్యం, 15రకాల వైద్య పరీక్షలు 105 రకాల మందులు, సూచనలు, సలహాలు ఇవ్వడం ఈ కార్యక్రమలక్ష్యం అని తెలిపారు. కార్యక్రమంలో డేవిస్ పేట నాయకులు మేనాటి ప్రసాద్ రెడ్డి, తహశీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ నాగేంద్రబాబు, ఇఒపిఆర్‌డి వసుంధర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










