Feb 26,2023 01:29
మాట్లాడుతున్న జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కుంభ నాగేంద్రమ్మ, చిత్రంలో వైద్యులు

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఉచిత సహాయ ఉపకరణాల కోసం వైద్య నిర్ధారణ శిబిరం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహిత విద్య సమన్వయకర్త కుంభా నాగేంద్రమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ జయచంద్ర కుమార్‌ (పిహెచ్‌సి మోదేపల్లి) టి నాగకోటేశ్వరరావు (సైకాలాజిస్టు) పి చంద్రయ్య (ఆడియాలజిస్టు), లాస్య (ఆప్తమాలజిస్టు) ఎం ఇందిరా ప్రియదర్శిని (ఫిజియో థెరపిస్టు) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మ మాట్లాడుతూ కొద్దిరోజులలో ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. 209 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. త్వరలో సంబంధిత ఉపకరణాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి, జె పంగులూరు, కొరిశపాడు, సంతమాగులూరు, బల్లికురవ మండలాల నుంచి 209 మంది పిల్లలు హాజరయ్యారని, వారిలో 129 మందికి ఉపకరణాలు అందజేస్తారని తెలియజేశారు. మానసిక వైకల్యం పిల్లలు 52 మంది, వినికిడిలోపం 33 మంది, చలన వైకల్యం 40 మంది, దృష్టి లోపం 4 మందికి ఉపకరణాలు అందించడం జరుగుతోందని తెలియజేశారు.