ప్రజాశక్తి -పెదబయలు రూరల్: ఇటీవల కాలంలో వరుస మరణాలు సంభవించిన కుంతర్ల పంచాయతీ కిండలం గ్రామాన్ని శుక్రవారం కేజిహెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం సందర్శించింది. ఇంటింటి సందర్శించి 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 23 మందికి వయసుతో సంబంధం లేకుండా బిపి ఉన్నట్లు నిద్దరణ చెప్పారు. ఏడుగురు మరణాలు సహజ మరణాలేనని వైద్యులు తెలిపారు.గ్రామంలో మూఢనమ్మకాలతో వైద్య పరీక్షలు చేసుకొనడానికి ముందుకు రాలేదని చెప్పారు.ఆహారపు అలవాట్లలో అధికంగా ఉప్పు వాడుతున్నట్లు వైద్య బందం తెలిపారు.చనిపోయిన వారిలో హైబీపీ ఉండడంతతోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిపారు.ఊపిరితిత్తుల వ్యాధితో కూడా మరణించినట్లు నిర్ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగాధరం, కేజిహెచ్ ప్రొఫెసర్ సింధూర, అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణారావు, జిల్లా మెడికల్ సూపరింటెండ్‌ెం శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.










