ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న సిబ్బందికి బుధవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా చేపట్టిన ఈ బదిలీల్లో జిల్లా పరిధిలోని ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అటెండెంట్, డ్రైవర్, తోటి, స్వీపర్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్‌లి, ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ 4, ఫామిలీ వెల్ఫేర్ వర్కర్, ఫామిలీ ప్లానింగ్ వర్కర్ పోస్టులకు సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రావణబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. అనంతరం బదిలీ ఉత్తర్వులను డిఎంఅండ్‌హెచ్‌ఒ ఆయా ఉద్యోగులకు అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల డిఎంఅండ్‌అండ్‌హెచ్‌ఒ డాక్టర్ విజయమ్మ, పల్నాడు డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రత్నమన్మోహాన్, డాక్టర్ సుబ్బరాజు , రాజేంద్రప్రసాద్, రజాక్ పాల్గొన్నారు.










