Jun 28,2023 20:48

వైద్య ఆరోగ్య శాఖలో ఉల్లంఘనలు

వైద్య ఆరోగ్య శాఖ బదిలీ నిబంధనల ఉల్లంఘనలపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో కడప నగరంలోని డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో జోన్‌-4 పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉద్యోగులకు బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్‌డి కార్యాలయ ఉన్నతాధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా బదిలీలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్స్‌ కేటగిరీ బదిలీలను ఇష్టానుసారంగా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
వైద్య ఆరోగ్య శాఖ జోన్‌-4లోని 23 విభాగాల పరిధిలో సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో కడప రీజినల్‌ డైరెక్టర్‌ ప్రాంతీయ కార్యాల యంలో నాలుగు ఉమ్మడి కడప జిల్లాలకు చెందిన ఉద్యోగులకు బదిలీలు చేపట్టిన సంగతి తెలిసిందే. 700 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకు న్నారు. వీరిలో 30 శాతం నిబంధన కింద రెండేళ్ల రిక్వెస్ట్‌, ఐదేళ్లు కాల పరిమితి కలిగిన ఉద్యోగుల పారామీటర్ల కింద 525 మంది బదిలీలకు అర్హులై నట్లు సమా చారం. పాత ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్లకు ఈనెల 21న కౌన్సెలింగ్‌ నిర్వ హించిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు ఒకేచోట సర్వీస్‌ పూర్తి చేసిన ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్స్‌ 38 మంది బదిలీ కావాల్సి ఉండగా 15 మందిని మాత్రమే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొంత మందిని యూనియన్‌ బేరర్‌లుగా రిటెన్షన్‌ చేయడం, మరికొందరిని కారణం చూపకుండానే రిటెన్షన్‌ చేసినట్లు సమాచారం. ఉద్యోగుల బదిలీ నిబంధనల ప్రకారం ఐదేళ్లు లాంగ్‌ స్టాండింగ్‌, రిక్వెస్ట్‌ బదిలీకి రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు అర్హులని తెలు స్తోంది. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఉన్నతాధికారి బదిలీ నిబంధనల్ని ఉల్లం ఘించి రెండేళ్లు పూర్తి చేయని ఇద్దరు పారా మెడికల్‌ ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్లను మ్యూచ్యువల్‌ బేసిస్‌ కింద బదిలీ చేయాలని ఆదేశించడం గమనార్హం. రీజినల్‌ డైరెక్టర్‌ కడప జిల్లాలోని మాధ వరం పిహెచ్‌సి ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్‌ను అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని తంబిళ్లవారిపల్లికు, ఇక్కడ పనిచేస్తున్న ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్‌ను మాధవరం పిహెచ్‌సికి బదిలీ చేసినట్లు సమాచారం. వీరిద్దరి పేర్లు 15 మంది బదిలీ జాబితాలో కూడా లేకపోవడం గమనించాల్సిన అంశం. 2023 మే నెలా ఖరుతో మ్యూ చ్యువల్స్‌ బదిలీ జాబితాల జాబితాలో కూడా ఆఫ్తాల్మిక్‌ కేడర్‌ లేకపోవడం గమనార్హం. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యా మిలీ వెల్ఫేర్‌ మౌఖిక ఆదేశాల పేరుతో బదిలీ చేయడం ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. మ్యూచ్యువల్‌ బదిలీలు ముగిసినప్పటికీ సదరు ఆప్తా ల్మిక్‌ ఆఫీసర్స్‌ కోసం తెరుచుకోవడంలో మతలబేమిటనే అంశం చర్చనీ యాంశంగా మారింది. దీనిపై సదరు రీజనల్‌ డైరెక్టర్‌ను ఫోన్‌లో పలు మార్లు సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.