ప్రజాశక్తి - చీరాల
వినాయక చవితి సందర్భంగా పందిళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనాలకు తరలిస్తున్నారు. వాడరేవు సముద్ర తీరానికి భారీగా విగ్రహాలు తరలి వెళ్లాయి. తీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. మువకులు జైబోలో గణేష్ మహరాజ్‌కి అంటూ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. పేరాల మహాలక్ష్మి చెట్టు వద్ద రాపిడ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలతో ప్రత్యేక పూజలు అనంతరం మేళతాళాలతో ర్యాలీగా పట్టణ పురవీధులలో వినాయక విగ్రహా నగరోత్సవం నిర్వహించారు.










