Jun 01,2023 00:31

వేటపాలెంలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పోతుల సునీత

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ : మండల పరిధిలోని చింతలపాలెం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ పున్ణ ప్రతిష్ట బుధవారం వేడుకగా నిర్వహిస్తున్నారు. ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాన్ని గ్రామస్తులు, ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారాలతో పునర్ధురించారు. జయ విజయులు, గరుత్మంతుని నూతన విగ్రహాలు, నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ చంద్రులు, వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. యాచమనేని సుధాకర్‌ పర్యవేక్షణలో శ్రీమాన్‌ నారాయణం బాల సుబ్రమణ్యం నేతత్వంలో వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాచమనేని నాగేశ్వరరావు, శ్రీదేవి, బిజినేపల్లి రాజశేఖర్‌, రాధాదేవి, గుమ్మడపు వాసుదేవరావు, సింధు, యాచమనేని జగన్నాధరావు, విజయ, రావు వేణుగోపాలరావు, సింధు దంపతులు పాల్గొన్నారు.
శ్రీచెన్నకేశవస్వామి దేవస్థానంలో
ప్రజాశక్తి-వేటపాలెం
స్థానిక శ్రీచెన్నకేశవస్వామి దేవస్థానంలో శిలాధ్వజస్థంభం ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై కోడూరి కిరణ్‌కుమార్‌ ఆయన సతీమణి రాధామాధవి, వైసిపి చీరాల నియోజక వర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైసిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీతను ఎన్నారై కిరణ్‌కుమార్‌ సత్కరించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయశాఖ బాపట్ల జిల్లా ఎసి ఎం.పానకాలరావు, ఆలయ ఇఒ జివిఎల్‌.కుమార్‌, ఆలయ అర్చకులు నారాయణం అనంత పద్మానాభచార్యులు, శ్రీనివాసుల హనుమాచార్యులు, ముత్తేవి శశీకాంత్‌ ఆచార్యులు, పురప్రముఖులు ప్రత్తి వెంకట సుబ్బారావు,ప్రత్తి ముత్తుకుమరన్‌, కరణం మురళీ, వల్లంపట్ల మురళీకృష్ణ పాల్గొన్నారు.
సంతమాగులూరులో
ప్రజాశక్తి- సంతమాగులూరు
మండల పరిధిలోని ఏల్చూరు గ్రామంలో దేశమ్మ తల్లి త్రయాహానిక ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కష్ణచైతన్య, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఓరుగంటి కోటిరెడ్డి. జడ్‌పి అడవి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.