Apr 08,2023 00:19
విజేతలకు బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం ఉప్పుటూరులోని వెంకటేశ్వర, చెన్నకేశవస్వామి వార్ల తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఇఓ టివి శివనాగదాసు, ఆలయ ఛైర్మన్‌ బెండపూడి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. తిరునాళ్లను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలురాధా బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన విజేత కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన బత్తుల వంశీకృష్ణారెడ్డికి రూ.25,116, ద్వితీయ బహుమతి చిలకలూరిపేట మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన యజమానికి రూ.20 వేలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు మువ్వా అంజయ్య, టి వెంకయ్య, కె రాఘవయ్య, కోడూరి శేషబ్రహ్మాచారి, షంషుద్దీన్‌, హుసేన్‌, కె సురేష్‌, ఏవి కృష్ణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ తిరునాళ్లను సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఇఓ శివనాగదాసు ఆమంచిని సత్కరించారు. ఆమంచి వెంట ఉప్పుటూరు గ్రామ సర్పంచ్‌ తిరుమలేశ్వరరావు, వెంకట్రావు, కాలేషా, తోకల కృష్ణమోహన్‌, గాదె సురేష్‌, కోడూరి శివనాగరాజు, అనీల్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.