
తిరువీధి సేవ
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉపమాక వెంకన్న ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా గోదాదేవి అమ్మవారి తిరువీధి సేవ వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమా చార్యులు, పీసపాటి శేషాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం రాజ వాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని మాడవీధుల్లో హరినామ సంకీర్తనతో ఊరేగించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని పండ్ల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఆలయంలో గోదాదేవి అమ్మవారి మూలవిరాట్ సన్నిధిలో అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ చేశారు.