May 02,2023 23:26

కొండ దిగున స్వామి అమ్మ వార్లను రావణబ్రహ్మ వాహనంపై ఊరేగిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - అన్నవరం
రత్నగిరి శ్రీ వీర వేంకట సత్య నారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా మూడవ రోజైన మంగళవారం వధూవరులైన స్వామి, అమ్మవార్లకు సాంప్రదాయ బద్ధంగా అరుంధతీ నక్షత్ర దర్శనం గావించారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన సాయంత్రం 5 గంటలకు దర్భారు మండపంలో స్థాలీపాక ప్రదాన ప్రవేశ హౌమం తంతు రుత్వి కులు నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంట లకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయి ద్యా లతో నడుమ వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం గావించారు. శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవాలలో భాగంగా మంగళవారం కొండ దిగున శ్రీ సత్య దేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారు రావణ వాహనంపై ఊరేగింపు కార్యక్రమాన్ని రాత్రి 8 గంటలకు ఇఒ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ప్రారంభించారు. కోలాటాలు, విచిత్రవేషధారణలు, తప్పెట గుళ్లు తదితర కార్యక్రమాల నడుమ స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం గ్రామ స్తులు, యాత్రికులు వీక్షిస్తుండగా వైభవంగా సాగింది. కార్యమ్రంలో పలు వురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.