ప్రజాశక్తి- తోటపల్లిగూడూరు : మండలంలోని వరిగొండలోని మెట్ట మీద ఉన్న పోలేరమ్మ జాతర వేడుక లు ఈ నెల 20వ తేదీ నుంచి వైభవం గా జరుగుతున్నాయి. మాజీ వ్యవస్థాపక ధర్మక ర్త తిరుమూరు సుధాకర్ రెడ్డి కుమారులు ఉద రు కిరణ్ రెడ్డి, సంజరు కిరణ్ రెడ్డిల ఆధ్వర్యంలో , స్థానిక వైసిపి నాయకులు గూడూరు విష్ణు మోహన్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ మహోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకం, పులంగి సేవలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఉభయకర్త గూడూరు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో ఘనం గా అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అన్నదానం చేశారు. మహోత్సవాలకు హాజరైన ప్రజలకు గ్రామస్తులు, విష్ణుమోహ న్ రెడ్డి అన్ని వసతులు కల్పించారు. ఆలయ అ ర్చకులు ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు తీర్ధ ప్ర సాదాలు అందజేశారు.










