Oct 15,2023 21:26

వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
ప్రజాశక్తి-కార్వేటినగరం: కార్వేటినగరం బాలత్రిపురసుందరి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైబ óవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి అమ్మవారి ఆల యంలో వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పట్టువస్త్రాలు, ఆభరణాలతో సుం దరంగా అలంకరించారు. బాలత్రిపురసుందరి అవతారంలో అమ్మ వారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆలయంలో అర్చకులు హోమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భక్తులకు కావలసిన సౌకర్యాలను ఆలయ కమిటి అధ్యక్షులు ప్రసాద్‌ పర్యవేక్షించారు. ఉభయదారులు ఉద రుకుమార్‌, నందకుమార్‌లు అమ్మవారికి పట్లువస్త్రాలను సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ కమిటి ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఎస్‌ఆర్‌పురం: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మం డలంలోని వి.వి.పురంలోని ఆరిమాని గంగమ్మ ఆలయంలో విశేష పూజలు జరిగాయి. డిప్యూటి సిఎం నారాయణస్వామి, ఏపీఎస్‌ ఆర్టిసి వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, ఏకవీర ఫౌండేషన్‌ ప్రతాప్‌ స్వామీజీ అమ్మవారికి ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు.
చౌడేపల్లి: నవరాత్రి బ్రహోత్సవాలు బోయకొండలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు గంగమ్మ తల్లి బాలత్రిపుర సుందరీ అలంకరణలో దర్శినమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. బెంగళూరుకు చెందిన ఉదయదారులు మంజుల కుంటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో చంద్రమౌళి భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రూ.లక్ష, వెండి సామాగ్రి వితరణ
బోయకొండ గంగమ్మకు భక్తుడు శరణ్‌కుమార్‌రెడ్డి దంపతులు రూ.3.50లక్షల వెండి సామాగ్రి, రూ.లక్ష అన్నదానానికి విరాళంగా ఆలయ ఈవోకి అందజేశారు.
సోమల: కందూరులో కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి.
చిత్తూరుఅర్బన్‌: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రాజస్థాన్‌ సేవా సంఘం నేతృత్వంలో ఆదివారం స్థానిక బిజెడ్‌ స్కూల్‌లో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జైన్‌ సంఘం ప్రతినిధి సుభాష్‌ జైన్‌ తెలిపారు. రోజూ దేవి అలంకారాలు, సాయంత్ర సమయంలో సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జౌన్‌ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.