Aug 18,2023 18:56

హారతి తీసుకుంటున్న ఎంఎల్‌ఎ

హారతి తీసుకుంటున్న ఎంఎల్‌ఎ
వైభవంగా కళ్యాణమహోత్సవం
ప్రజాశక్తి-కందుకూరు:శ్రీ స్కందపురి జనార్ధన స్వామి దేవస్థానం కీర్తిశేషులు శ్రీ రామగిరి భ్రమరాంబ, సుబ్బారావు కళ్యాణ మండపంలో శుక్రవారం శ్రీ జనార్ధన స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది . ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జనార్ధన స్వామి దేవాలయం కమిటీ చైర్మన్‌ రావులకొల్లు బ్రహ్మానందం, ఈఓ బైరాగి చౌదరి, శ్రీ రామగిరి వెంకటకష్ణ శంకర్‌ ప్రసాద్‌, శ్రీ రామగిరి మల్లికార్జున విద్యా శేఖర్‌, మాజీ ఏఎంసి చైర్మన్‌ తోకల కొండయ్య, వైసిపి నాయకులు కొండూరి వసంతరావు, ్ల తదితరులు పాల్గొన్నారు.