ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సోమవారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థుల ఆధ్వర్యంలో స్వామి వారి బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన వంటి పూజలతో మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం బృందావనాన్ని స్వర్ణకవచాలతో, పట్టువస్త్రాలతో, వివిధ పుష్ప హారాలతో అలంకరించారు. రాఘవేంద్రస్వామి ఆరాధ్య దైవమైన మూల రాములకు విశిష్ట పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని బృందావనాన్ని దర్శించుకుని నైవేధ్య సమర్పణతో మంగళ హారతులు ఇచ్చారు.
శ్రీమఠంలో గురువందన సమర్పణ
- టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పీఠాధిపతులకు పుష్పాభిషేకం
శ్రీమఠంలో గురు పౌర్ణమి సందర్భంగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులకు పుష్పాభిషేకం నిర్వహించారు. గురు వందన కార్యక్రమంలో భాగంగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీపగడాల ఆనందతీర్థాచార్ నేతృత్వంలో పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీమఠం ఊయల మండపంలో పుష్పాభిషేకం నిర్వహించారు. ఆస్పరిలో వెలసిన శ్రీసాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. గురుపౌర్ణమి కావడంతో బాబాను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా సాయిరుత్విక్ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబాకు కాకడ హారతి, సుప్రభాతం, అభిషేకం, సత్యవ్రతం, సాయి స్తోత్రం నిర్వహించారు. మధ్యాహ్నం బాబా చిత్రపటాన్ని టాటా ఏస్ వాహనంలో ఉంచి పురవీధుల గూండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. టిడిపి ఆలూరు మాజీ ఇన్‌ఛార్జీ వీరభద్ర గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పీఠాధిపతులను సన్మానిస్తున్న దాస సాహిత్య ప్రాజెక్టు










