
ప్రజాశక్తి-వన్‌టౌన్
దుర్గగుడి ఆధ్వర్యంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణను ఘాట్ రోడ్డు వద్ద ఇఒ దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రారంభించారు. గిరిప్రదక్షిణ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేళా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నత్యాలు తదితర సాంస్కతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలకు అన్నవరం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్‌ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా రాష్ట్ర దేవాదాయ శాఖ నియమించింది. ఈ సందర్బంగా శుక్రవారం చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబతో కలిసి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఆలయ అధికారులతో చర్చించారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లిఖార్జునరావు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.