ప్రజాశకి- చింతూరు
ఆంధ్రా -చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలో సరిహద్దులోని కుంట పట్టణంలలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రాను ఆనుకొని ఉన్న సుక్మా జిల్లా కొంట పట్టణంలో 65 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కుంట నగరంలో తెలుగు వాళ్ళు 80 శాతం నివసిస్తు ఉండటం వలన ఆంధ్ర రాష్ట్రాల సంప్రదాయ పద్ధతిలోనే నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఐదో రోజు కనక దుర్గ, లలితా సుందరి దేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు తరలివచ్చారు. నవరాత్రులు మొదలైన రోజు నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి లలితా శాస్త్ర పఠనంతో ప్రారంభించి అమ్మవారిని ఆరాధించి తర్వాత మహా ఆరతి అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది.
సమూహ కుంకుమ పూజలు
సీలేరు : జీకే వీధి మండలం సీలేరులో దుర్గాదేవి 32వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా దుర్గాదేవి సన్నిధిలో ఘనంగా హోమం, సమూహ కుంకుమ పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వేద పండితులు నడుమ కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మాలలు ధరించిన దుర్గ భవానీలు స్వామివారి సన్నిధిలో భక్తి గీతాలు ఆలాపించారు. దేవి సన్నిధిలో భజన కార్యక్రమాలు రాత్రికి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.










