నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా పేరు గాంచిన శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రత్యేక అలంకరణలో వసంతాలు చల్లుకుంటూ మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ గ్రామంలో విహరించారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. వేద పారాయణులు సంతోష్ కుమార్ శర్మ, అలంకార్ బట్టర్, మయూరం రఘు స్వామి, రుత్వికులు నవ కలశ స్థాపన, స్తఫనం తోపాటు విశేష పూజలు నిర్వహించి, అనంతరం భక్తిశ్రద్ధలతో సుదర్శన చక్రత్తాళ్వార్లకు కోనేరులో చక్రస్నానమాచరించారు. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణంతో కుంభ ప్రోక్షణ చేసి ముక్కోటి దేవతలను యధా స్థానాలకు పంపించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిష్టగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయాన్ని శోభాయ మానంగా, పచ్చటి తోరణాలు, పుష్పాలు, విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సునీల్ కుమార్ స్వామి, సాయి కృష్ణశర్మ, సుమంత్ శర్మ, బాలస్వామి, టిటిడి డిప్యూటీ ఇఒ నటేష్ బాబు, సూపరిండెంటెంట్ వెంకటేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్, ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఆర్‌టిసి మాజీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, ఆలయ మాజీ చైర్మన్లు పల్లె సుబ్రహ్మణ్యం, అరిగెల సౌమ్యత్రీ చంద్రనాథ్, గ్రామ పెద్దలు గంటా వాసుదేవయ్య, చక్రాల రామసుబ్బన్న, జంగం శెట్టి సుబ్బయ్య, బూసెట్టి వెంకటసుబ్బయ్య, టిటిడి విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసులు ఆలయ బోయలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
- స్వామివారికి చక్రస్నానం చేయిస్తున్న అర్చకులు










