Apr 01,2023 20:37

వేషాధారణలతో నృత్యాలు చేస్తున్న దృశ్యం

వైభవంగా చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవం

ప్రజాశక్తి - బేతంచెర్ల

బేతంచెర్ల పట్టణంలోని వెల్దుర్తి రోడ్డులో శ్రీ చౌడేశ్వరి మాత తిరుణాల జ్యోతి మహోత్సవాలు శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం ఉదయం తెల్లవారుజాము వరకు వైభవంగా జరిగాయి. బేతంచర్లలోని సుంకులమ్మ ఆలయం నుండి చౌడేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవంపై అమ్మవారిని కొలువుంచి భక్తుల జన సందోహం మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఊరేగింపులో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కళాకారులు వేసిన శివపార్వతుల, మహిషాసుర మర్దిని ఆంజనేయ స్వామి రాక్షసులు, తదితర వేషధారణలో చేసిన నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతోగానో ఆకర్షించాయి. బేతంచెర్ల పోలీసు వారు అమ్మవారి జ్యోతుల ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు నిర్వహించారు.