May 31,2023 19:25

అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రజా ప్రతినిధులు

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని నగరడోన పంచాయతీలోని మజరా గ్రామమైన తిమ్మాపురంలో అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. బుధవారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బెల్డోన రామనాథ శాస్త్రి స్వామి సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం వేకువ జామున భక్తిశ్రద్ధలతో ఎల్లమాంబ, చౌడేశ్వరి దేవి విగ్రహాల ప్రతిష్టాపన చేపట్టారు. గత మూడు రోజుల నుంచి గ్రామంలో భక్తశ్రద్ధలతో మహిళలు పెద్ద ఎత్తున 101 కలషాలు, విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. ఇంటికొచ్చిన ఆడకూతుళ్లకు ఒడి బియ్యం నిర్వహించుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు చుట్టుపక్కల గ్రామ ప్రజలతోపాటు దేవరగట్టు ఆలయ ఛైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు, వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ నారాయణస్వామి, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, సర్పంచి నాగేంద్ర, వైసిపి నాయకులు హేమంత్‌, ఎపిఒ మాధవ శంకర్‌ హాజరయి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు, ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు.